: ఐఎస్ఐఎస్ మిలిటెంట్లు తమకు డబ్బు అక్కర్లేదన్నారట!


ఇటీవలే ఓ బ్రిటీష్ జాతీయుడిని చంపేసిన ఐఎస్ఐఎస్ మిలిటెంట్లు ఆ మేరకు వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో చివర్లో మరో బందీని ప్రదర్శించారు కూడా. తర్వాతి వంతు అతనిదే అని దాంట్లో పేర్కొన్నారు. అతని పేరు అలెన్ హెన్నింగ్. అతనూ బ్రిటీష్ జాతీయుడే. మధ్యప్రాచ్యంలో సామాజిక సేవలు అందిస్తున్న బ్రిటీష్ సంస్థలో పనిచేస్తున్నాడు. కాగా, అతని మిత్రులు ఐఎస్ఐఎస్ మిలిటెంట్లకు డబ్బు ఆఫర్ చేశారట. తమ మిత్రుడిని వదిలేస్తే పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామని చెప్పారు. అయితే, ఉన్మాదం నరనరానా పేరుకుపోయిన ఆ కిరాతకులు డబ్బును సైతం కాదన్నారట. దీనిపై, హెన్నింగ్ మిత్రుడొకరు మాట్లాడుతూ, "వారు డబ్బును లక్ష్యపెట్టలేదు. ఈసరికే వారు ఏదో ఒక ప్లాన్ చేసే ఉంటారు" అని తెలిపాడు. గ్రేటర్ మాంచెస్టర్ కు చెందిన 47 ఏళ్ళ హెన్నింగ్ కు ఇద్దరు పిల్లలున్నారు.

  • Loading...

More Telugu News