: 'జపాన్' వయసు పైబడుతోంది!


జపాన్ లో వృద్ధుల సంఖ్యే ఎక్కువగా ఉందట. జపాన్ జనాభా 127 మిలియన్లు కాగా, వారిలో 65 ఏళ్ళు పైబడిన వారి సంఖ్య 32.9 మిలియన్లట. వారిలో మళ్లీ 75 ఏళ్ళు పైబడినవారు 15.9 మిలియన్లు. అంటే, దేశ జనాభాలో వృద్ధుల సంఖ్య నాలుగింట ఒక వంతుకన్నా ఎక్కువే. జపాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. గతేడాదితో పోల్చితే సీనియర్ సిటిజన్ల సంఖ్య 0.9 శాతం పెరిగిందని నివేదిక చెబుతోంది. 2035 నాటికి ప్రతి ముగ్గురిలోనూ 65 ఏళ్ళు పైబడిన వ్యక్తి ఒకరు ఉంటారని మంత్రిత్వ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News