: ఈసారి 'పీకే' పోస్టర్ లో అమీర్ తో సంజయ్ దత్
బాలీవుడ్ కొత్త చిత్రం 'పీకే' పోస్టర్ లు ఒక్కొక్కటిగా విడుదలవుతూ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతున్నాయి. తాజాగా విడుదలైన ఈ సినిమా నాలుగో పోస్టర్ లో అమీర్ ఖాన్ తో పాటు నటుడు సంజయ్ దత్ కూడా ఉన్నాడు. ఇద్దరూ బ్యాండ్ మేళం డ్రెస్ లో పెద్దసైజు బూరలు ఊదుతున్నారు. ఆ పోస్టర్ ను అమీర్ ట్విట్టర్ లో పోస్టు చేశాడు. "ఇతను నా స్నేహితుడు. అతని పేరు భైరోన్, కానీ నేను 'భయ్యా' అని పిలుస్తాను" అని ట్వీట్ చేశాడు.