: 'తెలంగాణ విమోచన దినోత్సవం' సందర్భంగా కేసీఆర్ పై ధ్వజమెత్తిన కిషన్ రెడ్డి


హైదరాబాదు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో ఆ పార్టీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండిపడ్డారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం, తమకు గోల్కొండ కోటపై జెండా ఎగురవేసేందుకు అనుమతి ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. రజాకార్లు కావాలో, తెలంగాణ ప్రజలు కావాలో తేల్చుకోవాలని కేసీఆర్ కు సవాల్ విసిరారు. మహారాష్ట్ర, కర్ణాటకలో ప్రభుత్వాలు తమ రాష్ట్రాల దినోత్సవాలను అధికారికంగా జరుపుతాయని, ఇక్కడెందుకు జరపడం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అంతకుముందు జాతీయ జెండాను ఎగురవేసిన ఆయన నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి అమరులైన వారికి నివాళులర్పించారు. పార్టీ ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News