: మోడీ బర్త్ డే గిఫ్ట్ రూ. 5001


ప్రధాని నరేంద్ర మోడీ తన పుట్టిన రోజు సందర్భంగా తల్లి నుంచి రూ.5001 లను జన్మదిన కానుకగా అందుకున్నారు. తల్లి దీవెనల కోసం గాంధీనగర్ వెళ్లిన మోడీ, తల్లికి పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని హోదాలో తొలి జన్మదినాన్ని జరుపుకుంటున్న కొడుకును ఆశీర్వదించిన హీరాబా, రూ. 5001 లను జన్మదిన కానుకగా అందించారు. ఈ మొత్తాన్ని మోడీ, జమ్మూకాశ్మీర్ వరద బాధితుల సహాయనిధికి అందజేశారు. ఇదిలా ఉంటే, జన్మదినం సందర్భంగా తల్లి దీవెనల కోసం అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్ కు ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే మోడీ, ఓ సాధారణ కారులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. కాశ్మీర్ వరదల నేపథ్యంలో ఎవరూ తన జన్మదిన వేడుకలను జరపవద్దన్న మోడీ, తాను కూడా తల్లి దీవెనలు తీసుకుని సరిపెట్టారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, జపాన్ ప్రధాని షింజో అబేలు మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

  • Loading...

More Telugu News