: మహిళా జిమ్నాస్ట్ పై కోచ్ ల లైంగిక వేధింపులు, కేసు నమోదు


ఆ ఇద్దరు శిక్షకులు దారి తప్పారు. శిక్షణ తీసుకుంటున్న మహిళా జిమ్నాస్ట్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగని ఆ కామాంధులు, సదరు జిమ్నాస్ట్ పై లైంగిక వేధింపులకూ దిగారు. విషయాన్ని బయటకు చెబితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అయితే చివరకు ఆ జిమ్నాస్ట్ అధికారులకు ఫిర్యాదు చేసింది. అయితే కామాంధులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు, రెండు వారాలుగా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడమే కాక, సదరు ఫిర్యాదు బయటకు రాకుండా తొక్కిపెట్టారు. ఇక లాభం లేదనుకున్న మహిళా జిమ్నాస్ట్, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం ఆసియాడ్ క్రీడల కోసం ఇంచియాన్ వెళ్లిన నిందితులు మనోజ్ రాణా, చంద్రన్ పాఠక్ లను తక్షణమే తిరిగి రావాలంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రతిష్ఠాత్మక టోర్నీలో క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండానే నిందితులు వెనుదిరగాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News