: రక్షణ శాఖలో కీలక ఫైల్ అదృశ్యం


రక్షణ శాఖలో కీలక సమాచారమున్న ఓ ఫైల్ అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. అడ్వాన్స్ డ్ జెట్ ట్రైనర్ల కొనుగోలుకు సంబంధించిన కీలక సమాచారమున్న ఈ పత్రాలు మాయమైన ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. సదరు పత్రాలు ఎలా మాయమయ్యాయన్న విషయాన్ని తేల్చేందుకు ఇప్పటికే ఈ దర్యాప్తు ప్రారంభమైంది. ఈ ఫైల్ అదృశ్యం కారణంగా బ్రిటన్ నుంచి అందాల్సిన అడ్వాన్స్ డ్ జెట్ ట్రైనర్ లు మరింత ఆలస్యం కానున్నాయి. అంతేకాక మరో 20 ఎయిర్ క్రాఫ్ట్ లను కొనుగోలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం కూడా వాయిదా పడనుంది. ఈ నేపథ్యంలో ఈ ఫైల్ మిస్సింగ్ కు కారణమైన వారిపై కఠిన చర్యలు తప్పవని రక్షణ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News