: విద్యుదుత్పత్తిపై ప్రధాని టార్గెట్?
విద్యుత్ విషయంలో ప్రధాని బృహత్తర లక్ష్యాలను ప్రకటించారు. ఈ రోజు ఢిల్లీలో జవహర్ లాల్ జాతీయ సోలార్ మిషన్ ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మాట్లాడారు. 10వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ను 2017 నాటికి అదనంగా ఉత్పత్తి చేస్తామన్నారు. సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా 55వేల మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తామని తెలిపారు. సౌరవిద్యుత్ పరికరాల తయారీదారులు భారత్ లో పరిశ్రమలు స్థాపించాలని పిలుపునిచ్చారు.