: వేర్పాటువాదులు... నిజంగా కర్కశులే!


అసలే 12 రోజుల పాటు ఎడతెరిపి లేని వర్షాలు. వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. వందల మందిని పొట్టనబెట్టుకున్నాయి. లక్షలాది మంది కడుపులను మాడ్చేస్తున్నాయి. రోగాల బారిన పడేశాయి. తాజాగా కలరా కూడా ఆ రాష్ట్ర ప్రజలను కబళించేందుకు సిద్ధంగా ఉందన్న వార్తలు అందరినీ ఆందోళనలో పడేస్తున్నాయి. వరదల్లో చిక్కుకున్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం, ఆ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఇది. అక్కడి దయనీయ స్థితిగతులను తెలుసుకున్న ప్రతి వ్యక్తి చేతనైనంత సహాయం చేస్తున్నాడు. అయితే కాశ్మీరీల సంక్షేమం, భద్రతలే తమ లక్ష్యమంటూ ప్రచారం చేసుకుంటున్న కాశ్మీర్ వేర్పాటు వాదులు మాత్రం ఉగ్రవాదుల కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఆపదలో ఉన్న వారికి తాము చేయూతనందించకపోగా, సహాయం చేస్తున్న వారినీ వేర్పాటువాదులు అడ్డుకుంటున్న వైనం సభ్య సమాజాన్నే నివ్వెరపరుస్తోంది. మంగళవారం జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ కీలక నేత యాసిన్ మాలిక్ మరో అడుగు ముందుకేసి తనంత కర్కోటకుడు లేడంటూ చాటిచెప్పాడు. బుద్షా చౌక్ వద్ద ఓ ఇంటిలో చిక్కుకున్న చిన్నారులను రక్షించేందుకు రంగంలోకి దిగిన మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సహాయక బృందాలను అడ్డుకున్నాడు. యాసిన్ మాలిక్ నేతృత్వంలోని జేకేఎల్ఎఫ్ నేతలు సహాయక చర్యలు చేపట్టరాదంటూ ఏకంగా బ్యానర్లు పట్టుకుని మరీ నినదిస్తున్నారు. ఇంతటి క్రూర చర్యలకు పాల్పడుతున్న వీరిని కర్కశులనడం ఎంతమాత్రం తప్పు కాదేమో.

  • Loading...

More Telugu News