: నేటి నుంచి భారత్ లో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పర్యటన
చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ నేడు భారత పర్యటనకు వస్తున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం వస్తున్న జిన్ పింగ్ తొలుత బుధవారం అహ్మదాబాద్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడికి భారత ప్రధాని నరేంద్ర మోడీ, ప్రత్యేకంగా విందు ఇవ్వనున్నారు. సబర్మతి నదీ తీరాన ఏర్పాటు కానున్న ఈ విందుకు రెండు వైపుల నుంచి కేవలం ఐదుగురు చొప్పున హాజరు కానున్నారు. చైనా అధ్యక్షుడికి విందు నేపథ్యంలో మంగళవారమే మోడీ, అహ్మదాబాద్ చేరుకున్నారు. తన పర్యటనలో భారత్ తో పలు ఒప్పందాలు కుదుర్చుకోవాలని జిన్ పింగ్ భావిస్తున్నారు. అదే సమయంలో తన భూభాగంలోకి ఆ దేశ సైన్యంతో పాటు ప్రజల చొరబాటు అంశంపై భారత్, తన ఆందోళనను జిన్ పింగ్ ముందు వ్యక్తం చేయనుంది.