: నేడు హైదరాబాదులో చెన్నై, కోల్ కతాల మధ్య సీఎల్టీ టీ20 మ్యాచ్


ఛాంపియన్స్ లీగ్ టోర్నమెంట్ లో భాగంగా బుధవారం హైదరాబాదులో చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ తోనే ఈ ఏడాది సీఎల్టీ టోర్నీ ప్రారంభం కానుంది. నగరంలోని ఉప్పల్ స్టేడియంలో నేటి రాత్రి 8 గంటలకు జరగనున్న ఈ మ్యాచ్ పై నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. మ్యాచ్ నిర్వహణను హెచ్ సీఏ కొత్త ప్యానెల్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ఇటీవలే మాజీ మంత్రి వినోద్ ప్యానెల్ ను ఓడించి అర్షద్ అయూబ్ ప్యానెల్ కొత్తగా పాలక వర్గ బాధ్యతలు చేపట్టింది. సీఎల్టీలో భాగంగా ఏడు మ్యాచ్ లు హైదరాబాదులో జరగనున్న నేపథ్యంలో ఈ టోర్నీని విజయవంతంగా ముగించేందుకు అర్షద్ అయూబ్ ప్యానెల్ ఇప్పటికే పకడ్బందీ ప్రణాళిక సిద్ధం చేసుకుంది.

  • Loading...

More Telugu News