: 2 కోట్లతో హోంనీడ్స్ యజమాని జంప్
తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో గృహోపకరణాలు ఇస్తానని వినియోగదారులను మభ్యపెట్టి సుమారు 2 కోట్ల రూపాయలు వసూలు చేసిన హోంనీడ్స్ యజమాని రాజన్ పరారయ్యాడు. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అతనిని వీలైనంత తొందర్లో పట్టుకుంటామని హామీ ఇచ్చారు.