: వెయ్యికి పైగా పాక్ పార్లమెంటేరియన్లపై సస్పెన్షన్ వేటు?


పాకిస్థాన్ లో రాజకీయ సంక్షోభం తలెత్తే ప్రమాదం పొంచి ఉంది. ప్రతిపక్ష పార్టీల ఆందోళనలతో తలబొప్పికట్టిన పాక్ పార్లమెంటుపై ఆ దేశ ఎన్నికల సంఘం కత్తులు దూస్తోంది. ఎన్నికల సందర్భంగా వెయ్యిమందికి పైగా పాక్ పార్లమెంటు సభ్యులు తమ ఆస్తులకు సంబంధించిన వివరాల పత్రాలు ఎన్నికల సంఘానికి సమర్పించకపోవడంతో వారిపై సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉంది. మొత్తం 1174 మంది పాక్ పార్లమెంటు సభ్యుల్లో 96 మంది మాత్రమే వారి ఆస్తుల వివరాలు సమర్పించారు. మిగిలిన వారు సెప్టెంబర్ 30 లోపు ఆస్తుల వివరాలు వెల్లడించకపోతే పార్లమెంటు సభ్యత్వాన్ని సస్పెండ్ చేస్తామని పాక్ ఎన్నికల సంఘం హెచ్చరించింది.

  • Loading...

More Telugu News