: కేటీఆర్ పర్యటన... 22 మంది దళిత నేతల గృహనిర్బంధం
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల పర్యటన సందర్భంగా దళిత నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తారని తెలిసిన 22 మంది దళిత నేతలు ఆయనను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని గృహనిర్బంధంలో ఉంచారు. దీనిపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.