: అమ్మాయిని తాకాడు... ఇప్పుడు లబోదిబో మంటున్నాడు!


ఆసియా క్రీడలు ఆరంభం కాకముందే దక్షిణ కొరియాలోని ఇంచియూన్‌లో లైంగిక వేధింపుల పర్వం వెలుగుచూసింది. దీనిపై నిందితుడు ఇక్కడి నిబంధనలు తెలియవని నెత్తిబాదుకుంటున్నాడు. ఇరాన్‌కు చెందిన ఓ సాకర్ అధికారి, ఓ మహిళా వాలంటీర్‌ ప్రక్కనే నిలబడి ఫోటో దిగాడు. ఈ సందర్భంగా ఆ వలంటీర్ ను తాకాడు. ఆమె పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసింది. దీంతో దక్షిణ కొరియా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతనిని కస్టడీలోకి తీసుకోకున్నా, దేశం విడిచి వెళ్లకూడదని పోలీసులు ఆదేశించారు. కాగా, దక్షిణ కొరియాలో తాకడం నేరమన్న సంగతి తనకు తెలియదని ఆ 38 ఏళ్ల ఇరాన్ సాకర్ అధికారి వాపోయాడు. దీంతో ఈ కేసును ప్రాసిక్యూటర్స్‌కు పంపాలా? వద్దా? అనే దానిపై పోలీసులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

  • Loading...

More Telugu News