: అంట్లు తోమడానికి మనుషులక్కర్లేదు... 'బోరిస్' చాలు
భవిష్యత్ లో పనిమనుషులు దొరకరేమోనన్న బెంగ అవసరంలేదు. పని మనిషి రాలేదని, చుట్టాలు వస్తున్నారని, అంట్లు పేరుకుపోయాయని అస్సలు భయపడక్కర్లేదని శాస్త్రవేత్తలు భరోసానిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో... బర్మింగ్ హామ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు పనిమనిషి లేని లోటును రోబోతో భర్తీ చేయనున్నారు. ఇంట్లోని అంట్లు తోమేసే రోబోను రూపొందించారు. ఇది వస్తువులపై ఉన్న జిడ్డు, ఆహారపదార్థాలు వంటి వాటిని మనుషుల్లాగే పసిగట్టేసి శుభ్రం చేసేస్తుంది. పాత్ర పూర్తిగా శుభ్రమైందని సెన్సర్లు గుర్తిస్తే కానీ ఆ పాత్రను రోబో విడిచిపెట్టదట. దీనికి 'బోరిస్' అని శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. గతవారం జరిగిన బ్రిటీష్ సైన్స్ ఫెస్టివల్ లో 'బోరిస్' ను ప్రదర్శించారు.