: ఆస్కార్ స్క్రీనింగ్ కు 'మనం'


ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ సందడి మొదలైంది. ఆస్కార్ నిర్వాహకులు ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీ కింద ఎంట్రీలను ఆహ్వానించారు. మనదేశం తరపున ఈ కేటగిరీలో పోటీకి పంపేందుకుగాను ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎఫ్ఐ) 30 సినిమాలను స్క్రీనింగ్ చేయనుంది. వాటిలో అక్కినేని ఫ్యామిలీ నటించిన 'మనం' కూడా ఉండడం విశేషం. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రం ఇదే. ఈ సినిమాలో ఆయన కుమారుడు నాగార్జున, మనవడు నాగచైతన్య కూడా నటించారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కుటుంబ కథా చిత్రాలలో సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది. 'మనం'తోపాటు 'మిణుగురులు' చిత్రం కూడా స్క్రీనింగ్ జాబితాలో ఉంది. ఎఫ్ఎఫ్ఐ ఈ సినిమాలను స్క్రీనింగ్ చేసేందుకు ఓ కమిటీని నియమించింది. ఆయా చిత్రాలను ఈ కమిటీ బుధవారం నుంచి హైదరాబాదులో స్క్రీనింగ్ చేస్తుంది. ఈనెల 23న తుది జాబితా ఖరారు కానుంది.

  • Loading...

More Telugu News