: అది రాష్ట్ర ప్రభుత్వం ఘనత కాదు... కేంద్రం నజరానా: పెద్దిరెడ్డి


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ఘనత కాదని వైఎస్సార్సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని ముక్కలు చేసినందుకు పరిహారంగా కేంద్రం 24 గంటల విద్యుత్ ను నజరానాగా ఇస్తోందని పేర్కొన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం టీడీపీ ప్రభుత్వం అర్హులకు పింఛన్లు అందజేయడం లేదని ఆయన విమర్శించారు. డ్వాక్రా, రైతు రుణమాఫీ చేయకుండానే తమ ప్రభుత్వం అంత చేసింది, ఇంత చేసింది అని చెప్పుకోవడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News