: 'ఐఎస్ఐఎస్'పై దాడులకు శ్రీకారం చుట్టిన అమెరికా


ఇరాక్ లో ఐఎస్ఐఎస్ మిలిటెంట్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రభుత్వ బలగాలకు దన్నుగా అమెరికా వైమానిక దాడులకు శ్రీకారం చుట్టింది. నైరుతి బాగ్దాద్ ప్రాంతంలో ఆదివారం నాడు తొలి దాడి చేసిన యూఎస్ ఫైటర్ జెట్లు, సోమవారం కూడా బాంబుల వర్షం కురిపించాయి. ఈసారి సింజార్ ప్రాంతంలో ఉన్న మిలిటెంట్ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఇరాకీ బలగాలు ముందుకు వెళ్ళేందుకు వీలుగా అమెరికా యుద్ధ విమానాలు వ్యూహాత్మక దాడులు జరిపాయి. ఈ మేరకు యూఎస్ సెంట్రల్ కమాండ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News