: మీరట్ లో 'స్పెషల్' ఫ్యామిలీ!
ఉత్తరప్రదేశ్ లోని మీరట్ నగరంలో కరణ్ సింగ్ అనే బాలుడి గురించి, అతడి కుటుంబం గురించి అడిగితే ఎవరైనా చెప్పేస్తారు. వయసుకు మించిన పొడవుతో ఉన్న ఈ బాలుడు గిన్నిస్ బుక్ లోకి ఎక్కాడు కూడా. విషయం ఏమిటంటే... ఆరేళ్ళ వయసుకే కరణ్ సింగ్ 5.7 అడుగుల ఎత్తు ఎదిగాడు. స్కూల్లో చేరిన తొలినాళ్ళలో 'వీడెవడ్రా బాబూ, లంబూలా ఉన్నాడు' అనుకుని ఇతర పిల్లలు దూరంగా వెళ్ళిపోయేవారట. తర్వాత్తర్వాత వారు ఫ్రెండ్స్ అయ్యారట మనవాడికి. కరణ్ తల్లిదండ్రులూ పొడగరులే. తల్లి స్వెత్లానా సింగ్ ఎత్తు 7.2 అడుగులు, తండ్రి సంజయ్ ఎత్తు 6.6 అడుగులు. 2012 వరకు 'ఇండియా టాలెస్ట్ ఉమన్' గా గిన్నిస్ బుక్ లో స్వెత్లానా పేరే ఉండేది. అయితే, పశ్చిమ బెంగాల్ కు చెందిన సిద్దిఖా పర్వీన్ అనే మహిళ 8.2 అంగుళాల ఎత్తుతో స్వెత్లానాను వెనక్కి నెట్టింది. బెంగళూరులో విద్యాభ్యాసం సందర్బంగా ప్రేమలో పడిన సంజయ్, స్వెత్లానా 2007లో వివాహం చేసుకున్నారు. ఒకరినొకరం చూసుకోగానే తామిద్దరం 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' అని భావించామని డైటీషియన్ గా పనిచేస్తున్న సంజయ్ తెలిపారు.