: పోలీసుల వైఖరి నాపై కక్ష కట్టినట్లుగా ఉంది: ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఓ ఏటీఎం వద్ద చెత్త ఎక్కువగా ఉండడం పట్ల ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించగా, ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై జేసీ ప్రభాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వైఖరి తనపై కక్ష కట్టినట్లు అనిపిస్తోందన్నారు. పోలీసుల ప్రవర్తనపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. తాడిపత్రి పరిశుభ్రత, అభివృద్ధి విషయంలో రాజీపడేది లేదన్న జేసీ, కోట్ల రూపాయల సొంత నిధులు వెచ్చించి తాడిపత్రిని అభివృద్ధిలోకి తెచ్చానని చెప్పారు.