: బ్రెయిన్ ఫిట్ నెస్ కు 'పంచసూత్ర ప్రణాళిక'


నేటితరంలో బహుళ కార్య సాధకత (మల్టీ టాస్కింగ్) అంశానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. బిజీ లైఫ్ లో ఎన్నో పనులు... అన్నింటినీ ఒక్కరే నిర్వర్తించాల్సి రావచ్చు. అందుకు శారీరకంగా ఫిట్ గా ఉండడం ఎంత అవసరమో... మెదడు చురుగ్గా ఉండడమూ అంతే అవసరం. బ్రెయిన్ ఫిట్ గా ఉంటేనే శరీర కదలికలు, ఆలోచనలు సవ్యంగా ఉంటాయన్నది నిపుణుల మాట. అందుకు వారు ఐదు సూత్రాలు పాటించాలని అంటున్నారు. మంచి డైట్ సరైన ఆహారం తీసుకోవడం ద్వారా మెదడును చురుగ్గా ఉంచుకోవచ్చు. ఆకుకూరలు, కాయగూరలు, తాజా పండ్లు తీసుకోవాలి. వాటిలో ఉండే యాంటీ ఆక్సిడాంట్లు బ్రెయిన్ సెల్ డ్యామేజీని అరికడతాయి. చేపలు, డ్రై ఫ్రూట్లు (వాల్ నట్లు, ఆల్మండ్స్) మెదడు ఆరోగ్యానికి మేలైనవి. కంటి నిండా నిద్ర ప్రశాంతమైన నిద్రతో దేన్నీ పోల్చలేం. నేటి స్పీడ్ యుగంలో కంటి నిండా నిద్ర ఎంతో మేలు చేస్తుంది. తద్వారా శరీరం, మెదడు రిలాక్స్ అవుతాయి. ఒత్తిడికి నో చెప్పండి పని ఒత్తిడో, ఇతర కారణాల వల్ల ఒత్తిడో... దీర్ఘకాలంలో ఆ ప్రభావం శారీరక ఆరోగ్యంపై పడుతోంది. ఒత్తిడి అధికమైతే మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. దీంతో, బ్రెయిన్ సెల్స్ నశించిపోతాయి. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు దీర్ఘంగా శ్వాస పీల్చి వదలడం ద్వారా రిలీఫ్ పొందవచ్చు. మెదడుకు మేత మెదడును క్రియాశీలకంగా ఉంచుకోవాలంటే దానికి నిరంతరం పని కల్పించాలి. అందుకోసం, సుడోకు, క్రాస్ వర్డ్ పజిళ్ళు, చదరంగం వంటి వాటికి సమయం కేటాయించాలి. క్రమబద్ధమైన జీవితం నియమబద్ధమైన జీవితం మెదడుపై భారాన్ని తగ్గిస్తుంది. తద్వారా ఒత్తిడి దరిచేరదు, మెదడు ఫిట్ గా ఉంటుంది.

  • Loading...

More Telugu News