: ఉత్తరప్రదేశ్ లో చతికిలపడ్డ బీజేపీ
సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో 70కి పైగా పార్లమెంట్ స్థానాలను సాధించి సంచలనం సృష్టించిన బీజేపీ ఉప ఎన్నికల్లో చతికిలపడింది. సార్వత్రిక ఎన్నికల మాదిరే ఉపఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ చేస్తామని బీజేపీ వర్గాలు భావించాయి. అయితే, ఫలితాలు పూర్తి వ్యతిరేకంగా వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లో మొత్తం 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరిగాయి. వీటిలో బీజేపీవి పది సిట్టింగ్ స్థానాలు. 9 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఓటమి దిశగా పయనిస్తోంది. కేవలం రెండు అసెంబ్లీ స్థానాల్లోనే బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఉత్తరప్రదేశ్ లో అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ అనూహ్యరీతిలో తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో ఘనవిజయం దిశగా పయనిస్తోంది.