: మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పై కాంగ్రెస్ దావా


మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వినోద్ రాయ్ పై కాంగ్రెస్ దావా వేసింది. ఈ మేరకు ఆయనకు లీగల్ నోటీసు కూడా పంపింది. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 2జీ స్పెక్ట్రమ్, కోల్ గేట్, కామన్ వెల్త్ తదితర స్కాంలు ఆయనకు తెలిసే జరిగాయంటూ వినోద్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దాంతో, మండిపడ్డ హస్తం సీనియర్ నేతలు 'మన్మోహన్ చిత్తశుద్ధినే ప్రశ్నిస్తారా?' అని ఎదురుదాడి చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ రాయ్ కోర్టులో దావా వేశారు.

  • Loading...

More Telugu News