: నిర్ణయాలు తీసుకోవాలా..? ఇదిగో ప్రత్యేక వెబ్ సైట్!
పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారా? ఇల్లు కొనాలనుకుంటున్నారా? అందుకిదే సరైన తరుణమనుకుంటున్నారా? అయితే, ఎలాంటమ్మాయిని చేసుకోవాలి? మంచి ఇల్లు, చవకగా ఎక్కడ లభిస్తుంది?... వీటన్నింటికి ఓ వెబ్ సైట్ మేమున్నామంటూ బదులిస్తోంది. ఇవే కాకుండా, జీవితంలో మరెన్నో కీలక నిర్ణయాలు తీసుకోలేక సతమతమయ్యే వారికి ఈ సైట్ సాయం చేస్తుందట. యూజర్లు ఇంటరాక్టివ్ పద్ధతిలో ఈ వెబ్ సైట్ లో తమ నిర్ణయాలకు తగిన సమాచారాన్ని పొందవచ్చు. శాన్ ఫ్రాన్సిస్కోలోని 'క్లోవర్ పాప్' అనే సంస్థ ఈ సైట్ కు ను అభివృద్ధి చేసింది. యూజర్లు తమ నిర్ణయాలను తెలిపితే, ఈ వెబ్ సైట్ కు చెందిన ఫ్రొఫెషనల్ టీం దానిపై విశ్లేషణ జరుపుతుంది. ఇతరుల అనుభవాల ఆధారంగా ఆ నిర్ణయం ఎలా వర్కౌటవుతుందన్న విషయాన్ని వారు యూజర్ కు విడమర్చుతారు. అంతేగాకుండా, పలు మార్గాలను కూడా సూచిస్తారు. మరింత సాయం కావాలనుకుంటే నిపుణులతో సంప్రదింపులు ఏర్పాటు చేస్తారు. మీరూ ఓ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారా? అయితే, సదరు సైట్లోకి వెళ్ళి 'టెల్ యువర్ స్టోరీ' ఆప్షన్ క్లిక్ చేసి, మీ నిర్ణయం చెప్పేయండి. అందుకు ఇదిగో లింకు... https://www.cloverpop.com/.