: రాజస్థాన్ లో కూడా బీజేపీ వ్యతిరేక పవనాలు... ఆధిక్యంలో కాంగ్రెస్
ఉపఎన్నికలో బీజేపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే గుజరాత్, ఉత్తరప్రదేశ్ లో తొలి దశ రిజల్ట్ ట్రెండ్స్ బీజేపీకి నిరాశ కలిగించగా... తాజాగా రాజస్థాన్ లో కూడా ఆ పార్టీకి వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి. రాజస్థాన్ లో 4 స్థానాలకు ఉపఎన్నికలు జరగాయి. ఈ నాలుగు బీజేపీ సిట్టింగ్ స్థానాలు. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్ మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా... బీజేపీ కేవలం ఒకే ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది.