: టాయిలెట్లు కాస్తా ఆలయాలవుతున్నాయి: కేంద్ర మంత్రి గడ్కరీ
గ్రామీణ ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రతను కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి నితిన్ గడ్కరీ కళ్ళకు కట్టారు. నీటి లభ్యత లేని కారణంగా చాలా ప్రాంతాల్లో టాయిలెట్లు ఆలయాలుగానూ, గోడౌన్లుగానూ రూపాంతరం చెందాయని తెలిపారు. ప్రతి ఇంటికి టాయిలెట్ నిర్మిస్తే సరిపోదని, నీటి సరఫరా అంశానికి ప్రాధాన్యత కల్పించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన మూడు లక్షల టాయిలెట్లలో 10 వేలు మాత్రమే వినియోగంలో ఉన్నాయని వివరించారు. "కొన్ని చోట్ల టాయిలెట్ పునాదులపై ఆలయాలు నిర్మించడం చూసి ఆశ్చర్యపోయాను. కారణం... నీటి కొరతే. నీటి లభ్యత లేకుండా టాయిలెట్లు నిర్మించి ఉపయోగం లేదు" అని తెలిపారు. వంద రోజుల పాలనపై నిర్వహించిన ప్రెస్ మీట్లో గడ్కరీ పై వ్యాఖ్యలు చేశారు.