: నేడు అహ్మదాబాద్ కు ప్రధాని మోడీ
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ రోజు అహ్మదాబాద్ వెళుతున్నారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మూడు నెలల తర్వాత మోడీ అహ్మదాబాద్ రావడం ఇదే తొలిసారి. ముందుగా పార్టీ స్థానిక కార్యకర్తలతో ఆయన అక్కడి ఎయిర్ పోర్టు వద్దే మాట్లాడే అవకాశం ఉంది. అనంతరం, నిన్న (సోమవారం) గుజరాత్ చేరుకున్న చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో నేడు మోడీ సమావేశమవనున్నారు. మధ్యాహ్నం ఆయనతో సబర్మతీ తీరాన విందు కార్యక్రమం కూడా ఉంటుంది.