: ఫ్యాన్స్ ను నిరుత్సాహపరచని విధంగా ఆ పాటను రాశా: రామజోగయ్యశాస్త్రి
'గోవిందుడు అందరివాడేలే' సినిమాలో తాను రాసిన ఓ పాట ఎంతో సంతృప్తినిచ్చిందని గీత రచయిత రామజోగయ్య శాస్త్రి అన్నారు. ప్రతిష్ఠాత్మక బ్యానర్, ప్రతిష్ఠాత్మక సినిమాలో ఇంట్రడక్షన్ సాంగ్ రాయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. విలువలు పాటిస్తూ, ఫ్యాన్స్ ను నిరాశపరచని రీతిలో ఆ పాటను రాశానని, దానికి, యువన్ శంకర్ రాజా మంచి బాణీలిచ్చారని శాస్త్రి కితాబిచ్చారు. రామ్ చరణ్ రికమండేషన్ తోనే ఈ పాట రాసే అవకాశం దక్కిందని వెల్లడించారు.