: 'సత్యం' కుంభకోణం కేసులో నిందితులందరూ హాజరుకావాలని ఆదేశం
సత్యం కుంభకోణం కేసులో నిందితులందరూ అక్టోబర్ 27న తమ ముందు హాజరుకావాలని హైదరాబాదు నాంపల్లిలోని సీబీఐ కోర్టు ఆదేశించింది. అయితే, ఈ కేసులో తుది తీర్పును ఎప్పుడు వెల్లడించనున్నది చెప్పలేదని సీబీఐ ప్రత్యేక న్యాయవాది కె.సురేందర్ తెలిపారు. సత్యం కంప్యూటర్స్ సంస్థాపకుడు, మాజీ ఛైర్మన్ బి.రామలింగరాజు, ఆయన కుటుంబ సభ్యులు, సత్యం అధికారులు, ప్రైస్ వాటర్ కూపర్ హౌస్ మాజీ ఆడిటర్లు ఆదేశించిన తేదీన కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది.