: ఏపీ 'ఇ-క్యాబినెట్'పై కేంద్రం ఆసక్తి


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినూత్న రీతిలో నిర్వహించిన ఇ-క్యాబినెట్ భేటీపై కేంద్రం ఆసక్తి కనబరుస్తోంది. చంద్రబాబు ఈ ఉదయం మంత్రులతో కాగితంతో పనిలేకుండా, ఐపాడ్ లు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లతో సమావేశం నిర్వహించారు. దాంట్లో పలు పథకాలపై చర్చించారు. ఈ భేటీకి మీడియా విశేష ప్రచారం కల్పించింది. దీంతో, ప్రధాని కార్యాలయం కూడా ఇటువైపో కన్నేసింది. ఏపీ సర్కారు జరిపిన హై-ఫై భేటీకి సంబంధించిన వివరాలు అందించాలని అధికారులను కోరింది.

  • Loading...

More Telugu News