: క్రికెటర్ రైనాపై తల్లి అనుమానం!


టీమిండియా డాషింగ్ బ్యాట్స్ మన్ సురేశ్ రైనా ఇంకా బ్రహ్మచారే. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ అతని స్వస్థలం. ఎప్పుడైనా తాను లక్నో బయల్దేరానంటే తన తల్లి ఓ ప్రశ్న తప్పక అడుగుతుందని చెప్పాడు. 'తరచూ లక్నో ఎందుకు వెళుతున్నావు? అక్కడ ఏ అమ్మాయినైనా ఇష్టపడుతున్నావా?' అని చాలాసార్లు అడిగిందని చెప్పాడు. తనను పెళ్ళికొడుకుగా చూడాలన్నది ఆమె ఉద్దేశమని తెలిపాడీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మన్. తోటి క్రికెటర్లు తండ్రులవుతుండడం చూసి, తన తల్లి పెళ్ళంటూ తనను ఒత్తిడి చేస్తోందని చెప్పాడు. రైనా నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సంగతులు పంచుకున్నాడు. లక్నోలో తనకు మిత్రులున్నారని, వారిని కలిసేందుకే వెళుతుంటానని వివరించాడు. వరల్డ్ కప్ తర్వాతే పెళ్ళి ఆలోచన చేస్తానని స్పష్టం చేశాడు. రైనా విషయంలో ఇంతకుముందు ఎన్నో కథనాలు రావడం తెలిసిందే. ఓ రాజకీయనేత కుమార్తెతోనూ, నటి శృతి హాసన్ తోనూ అఫైర్లున్నట్టు వార్తలొచ్చాయి.

  • Loading...

More Telugu News