: మత సామరస్యాన్ని కాపాడటమే కాంగ్రెస్ లక్ష్యం: దిగ్విజయ్ సింగ్
దేశంలో మత సామరస్యాన్ని కాపాడటమే కాంగ్రెస్ లక్ష్యమని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ అన్ని వర్గాల వారిని కలిపి ఉంచుతుందని, కాంగ్రెస్ కు, ఇతర పార్టీలకు ఉన్న తేడా అదేనని పేర్కొన్నారు. తెలంగాణ వారే తమ రాష్ట్రంలో ఉండాలంటూ సీఎం కేసీఆర్ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ గొప్ప నగరమని, ఇది అందరిదీ అని చెప్పారు. హైదరాబాదులో ఈరోజు జరిగిన తెలంగాణ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో దిగ్విజయ్ మాట్లాడారు. ఇతర ప్రాంతాల వారికి నష్టం కలిగించేలా విభజన చట్టం తయారుచేయలేదని, అందరికీ న్యాయం జరిగేలా రూపొందించామని, అయినా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఒక్క సీటు కూడా గెలవకపోవడం బాధాకరమని అన్నారు.