: తెలంగాణ ఇంక్రిమెంటుపై ప్రభుత్వ ఉద్యోగుల నిరసన
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన ఇంక్రిమెంటుపై ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంక్రిమెంటు వల్ల తమకు లాభం లేదంటూ సచివాలయంలో లంచ్ అవర్ లో తెలంగాణ ఉద్యోగుల సమన్వయ కమిటీ ర్యాలీ నిర్వహించింది. ప్రత్యేక చెల్లింపును అన్ని అలవెన్సులకు వర్తించే రెగ్యులర్ ఇంక్రిమెంట్ గా మార్చాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. అటు పీఆర్సీ, హెల్త్ కార్డులు వెంటనే అమలు చేయాలన్నారు. ఏపీ ప్రభుత్వంలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తక్షణమే తెలంగాణ ప్రభుత్వానికి మార్చాలని కోరారు. ఈ సమయంలో ఉద్యోగుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.