: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికోసం బీజేపీ-శివసేన మధ్య పోటీ
అక్టోబర్ లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చిరకాల మిత్రులు బీజేపీ-శివసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. తమకు ఎక్కువ సీట్లు కావాలని ఇరు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో శివసేన బహిరంగంగానే బయటపడగా, బీజేపీ గుంభనంగా వుంది. దాంతో, అప్పుడే ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు ప్రకటించవద్దని బీజేపీ కోరింది. ఈ క్రమంలో నేడు శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేను కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కలిసే అవకాశం ఉంది. అటు, ఠాక్రే స్పందిస్తూ, బీజేపీకి ముఖ్యమంత్రి పదవిపై ఆశ ఉండొచ్చు కానీ... తమ ఆశను, అవకాశాన్ని ఎలా వదులుకుంటామని ప్రశ్నిస్తున్నారు. ఇరు పార్టీల మధ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, చర్చలు పూర్తై ఓ నిర్ణయానికి వచ్చే వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమనీ అన్నారు.