: చెన్నై చేరుకున్న 'టెర్మినేటర్'
'టెర్మినేటర్' సిరీస్ సినిమాలతో విపరీతమైన పాప్యులారిటీ సంపాదించుకున్న హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ ఈ ఉదయం చెన్నై చేరుకున్నారు. ఈ సాయంత్రం జరగనున్న 'ఐ' సినిమా ఆడియో లాంచ్ లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొంటున్నారు. శంకర్-విక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ ఆడియో వేడుకకు జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదిక. హాలీవుడ్ యాక్షన్ సినిమాలకు సరికొత్త నిర్వచనం చెప్పిన కండలరాయుుడు ష్వార్జ్ నెగ్గర్... భారత సినీ హీరోకు స్టయిల్ నేర్పిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకే వేదికను పంచుకుంటుండడం అభిమానులకు కనులవిందు చేయనుంది. ఆస్కార్ విజేత, స్వరమాంత్రికుడు ఏఆర్ రహ్మాన్ ఈ సినిమాలోని పాటలను ఆడియో లాంచ్ సందర్భంగా లైవ్ గా అందించనున్నారు. ఈ సినిమా దీపావళికి విడుదల అవుతుందని దర్శకుడు శంకర్ తెలిపారు.