: కేసీఆర్ గురించి సమ్మక్క సారలమ్మల దగ్గర మొక్కుకున్న ఎర్రబెల్లి
ఆదివారం తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఉన్న సమక్క సారలమ్మలను దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా దర్శనం తర్వాత అక్కడికి వచ్చిన విలేకరులతో వారు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కేసీఆర్ కు సద్బుద్ధిని ప్రసాదించాలని తాను సమ్మక్క సారలమ్మలను మొక్కుకున్నానని ఎర్రబెల్లి తెలిపారు. కేసీఆర్ అవాస్తవాలు మాట్లాడకుండా చూడాలని ... ఆయనకు కోపం, గర్వం కూడా తగ్గించాలని తాను వనదేవతలను వేడుకున్నానని ఎర్రబెల్లి తెలిపారు. కేసీఆర్ తన వందరోజుల పాలనలో వెయ్యి అబద్ధాలు ఆడారని ఆయన విమర్శించారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించేందుకు కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని రాజ్యసభ సభ్యుడు గరికపాటి రామ్మోహన్ రావు అన్నారు. టీడీపీ నాయకులకు మేడారం పూజారులు గిరిజన సాంప్రదాయం ప్రకారం ఘనస్వాగతం పలికారు.