: నేడు ఏపీ కేబినెట్ సమావేశం
ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి భేటీ నేడు జరగనుంది. సీఎం క్యాంపు కార్యాలయంలో నేటి ఉదయం జరిగిే ఈ భేటీలో కొత్త పింఛన్ల పంపిణీపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అక్టోబర్ 2 నుంచి పెంచిన పింఛన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం తీర్మానించిన తరుణంలో దీనికి నేటి భేటీలో కేబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. విజయవాడ పరిధిలో రాజధాని నిర్మాణానికి సంబంధించిన భూసేకరణపైనా మంత్రి మండలి కీలక చర్చ చేపట్టనుంది. ఇదిలా ఉంటే, మంత్రివర్గ సహచరుల పనితీరుపై నివేదికలు తెప్పించుకున్న చంద్రబాబు, నేటి భేటీలో వారికి గ్రేడులను నిర్ణయిస్తారన్న ప్రచారమూ సాగుతోంది.