: మహిళలకు భారత్ సురక్షితమైనదే!: లక్నో యువతి వినూత్న ప్రచారం


మహిళలకు భారత దేశం ఎప్పటికీ సురక్షితమైనదేనని లక్నోకు చెందిన ఈషా గుప్తా ప్రచారం చేస్తున్నారు. ఈ నినాదాన్ని దేశవ్యాప్తంగా వినిపించేందుకు ఆమె ఏకంగా ఓ బృహత్కార్యాన్నే చేపట్టారు. దేశంలోని ప్రధాన నగరాలను చుట్టి, ఆయా నగరాల్లో తన వాణిని వినిపించేందుకు బైక్ పై బయలుదేరారు. దాదాపు 6 వేల కిలో మీటర్ల మేర తన ప్రయాణాన్ని సాగిస్తూ భారత ప్రధాన నగరాల్లోని మహిళలను కలుస్తున్నారు. ఆదివారం ఆమె ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఎదగనున్న విజయవాడను సందర్శించారు. ఈ సందర్భంగా నగరంలోని మహిళలతో ఆమె మాట్లాడారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే, భారత్ ఎప్పటికీ సురక్షితమైనదేనని ఈషా గుప్తా, పునరుద్ఘాటించారు.

  • Loading...

More Telugu News