: రేపు ఏపీ కేబినెట్ భేటీ


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి సోమవారం భేటీ కానుంది. తొలిసారిగా పేపర్ లెస్ కేబినెట్ మీటింగ్ గా నిర్వహిస్తున్న ఈ సమావేశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ భేటీలో కొత్త రాజధాని నిర్మాణానికి సంబంధించి కీలక చర్చ జరిగే అవకాశాలున్నాయి. అంతేకాక 14వ ఆర్థిక సంఘంతో భేటీ తర్వాత జరుగుతున్న ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు కీలక ప్రతిపాదనలను కేబినెట్ ముందుంచనున్నట్లు సమాచారం. తాత్కాలిక రాజధాని విజయవాడకు ప్రభుత్వ శాఖల తరలింపుపైనా పలు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News