: ‘మహా’ సీఎం పీఠంపై బీజేపీ, సేనల మధ్య వార్!


అటు ఎన్నికల షెడ్యూల్ విడుదలైందో, లేదో, మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై వాగ్యుద్ధం రాజుకుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగానే బరిలోకి దిగాలని బీజేపీ, శివసేనలు గతంలోనే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మరుక్షణమే రెండు పార్టీల మధ్య సీఎం పీఠం విభేదాలను సృష్టించింది. ఈ వివాదాన్ని తొలుత శివసేన మొదలుపెడితే, బీజేపీ దానికి ఆజ్యం పోసింది. సీఎం పీఠం కోసం శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే గళం విప్పిన మరునాడే ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్, శివసేన నేతనే సీఎం పీఠం అధిష్ఠిస్తారంటూ వ్యాఖ్యానించారు. రౌత్ వ్యాఖ్యలపై బీజేపీ వెనువెంటనే స్పందించింది. రౌత్ ను చోటా నేతగా అభివర్ణించిన బీజేపీ, తమ పార్టీ అభ్యర్థే సీఎం పీఠంపై కూర్చుంటారని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య దూరం మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News