: యూపీఏ నిర్వాకంతోనే ఉగ్రవాదం పెరిగిపోయింది: అమిత్ షా


కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ నిర్వాకం కారణంగానే దేశంలో ఉగ్రవాదం పెరిగిపోయిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఆదివారం ఉత్తరాఖండ్ లో పర్యటించిన సందర్భంగా అమిత్ షా, యూపీఏ పాలనపై విరుచుకుపడ్డారు. ఉగ్రవాద వ్యతిరేక చట్టాలను రద్దు చేయడం, మరికొన్ని చట్టాలను నీరుగార్చడం తరహా చర్యలు అవలంబించిన యూపీఏ, ఉగ్రవాదానికి పరోక్షంగా మద్దతిచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News