: అక్టోబర్ 5 నుంచి అమీర్ షో ‘స్యతమేమ జయతే’ మూడో సీజన్!


బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్, బుల్లితెరపై మారోమారు ప్రత్యక్షం కానున్నాడు. స్టార్ ప్లస్ లో రెండు విడతలుగా ‘సత్యమేవ జయతే’ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించిన అమీర్, మూడో సీజన్ కు తెరలేపేందుకు సన్నాహాలు పూర్తి చేశాడు. అక్టోబర్ 5 నుంచి సత్యమేవ జయతే మూడో సీజన్ ప్రసారం కానుంది. సమాజంలోని పలు రుగ్మతలపై యుద్ధం ప్రకటించిన అమీర్, కొన్ని వర్గాల నుంచి నిరసనలను ఎదుర్కొన్నాడు. అయినా వెనుకంజ వేయని అమీర్, తన మూడో సీజన్ ను ప్రారంభించేందుకే మొగ్గు చూపాడు. మూడో సీజన్ లో భాగంగా అతడు, ఏ అంశాలను ప్రస్తావిస్తాడన్న అంశంపై ప్రేక్షకులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. మూడో సీజన్ ప్రోమోలు త్వరలోనే ట్విట్టర్ లో విడుదల కానున్నాయి.

  • Loading...

More Telugu News