: కూంబింగ్ లో పోలీసులకి ఎదురుపడ్డ మావోయిస్టులు...పరస్పరం కాల్పులు


ఆదిలాబాద్‌ జిల్లా తిర్యాణి అటవీ ప్రాంతంలో పోలీసులకు... మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. తిర్యాణి మండలం, పంగిడిమాదిర గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో గ్రేహోండ్స్ దళాలు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా... హఠాత్తుగా పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో మావోయిస్టులు వెంటనే కాల్పులు ప్రారంభించగా... పోలీసులు కూడా ప్రతిగా కాల్పులు జరిపారు. సుమారు 20 నిమిషాల పాటు జరిగిన ఈ కాల్పుల్లో ఎవరికీ ప్రాణనష్టం కలుగలేదు. సంఘటనా ప్రాంతంలో నక్సలైట్ల కిట్ బ్యాగులను, సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News