: ఆకాశవాణి కేంద్రంలో లైంగిక వేధింపులు
ఆకాశవాణి ఢిల్లీ రేడియో కేంద్రంలో లైంగిక వేధింపుల బాగోతం బయటపడింది. బాస్ లు తమను వేధించుకుతింటున్నారని రేడియో జాకీలు ఫిర్యాదు చేయడంతో ప్రసారభారతి తీవ్రంగా స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఢిల్లీ ఆల్ ఇండియా రేడియో కేంద్రం డైరెక్టర్ బాజ్ పాయ్ కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. రేడియో జాకీలను లైంగికంగా వేధించిన డ్యూటీ ఆఫీసర్లు ఎన్.కె.వర్మ, షెల్లిని విధుల నుంచి తొలగిస్తూ ప్రసార భారతి సీఈఓ జవహర్ ఆదేశాలు జారీ చేశారు. ఇక సిబ్బంది డ్యూటీలను పర్యవేక్షించే దానిష్ ఇక్బాల్ ను సస్పెండ్ చేశారు.ఈ ఆరోపణలపై దర్యాప్తునకు ప్రసార భారతి ఆదేశించింది.