: రాజ్యసభ సీటొస్తే, రోజూ సభకెళతా: ఆమిర్ ఖాన్
రాష్ట్రపతి నామినేట్ చేసే రాజ్యసభ సభ్యత్వం తనకు దక్కితే, రోజూ సభకు హాజరవుతానని బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ అన్నారు. అలాంటి అరుదైన అవకాశం వస్తే వదులుకుంటానా? అన్న రీతిలో మాట్లాడిన ఆమిర్, రాజ్యసభ సభ్యత్వం దక్కితే, ప్రజలకు సేవ చేస్తానా? లేదా? అన్న విషయాన్ని నిర్ధారించుకుని ముందడుగు వేస్తానని వెల్లడించాడు. రాష్ట్రపతి కోటాలో ఎంపీలుగా మారిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటి రేఖలపై స్పందించాలన్న ‘ఇండియా టుడే’ వ్యాఖ్యాత విన్నపాన్ని నిరాకరించిన ఆమిర్, సభా సమావేశాలకు గైర్హాజరవుతున్న వారి తీరును పరోక్షంగా దెప్పిపొడిచే రీతిలో స్పందించారు.