: దుర్గ గుడి ఉద్యోగిని చితకబాది జీపులో తీసుకెళ్ళిన సీఐ
విజయవాడలో దుర్గ గుడి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇంద్రకీలాద్రిపై వాహనాలు అనుమతించవద్దన్న విషయమై దుర్గ గుడి ఉద్యోగికి, సీఐ సీతారామకృష్ణకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఆగ్రహం చెందిన సీఐ సదరు ఉద్యోగిని చితకబాది తన జీపులో తీసుకెళ్ళారు. దీంతో, పోలీసుల తీరుకు నిరసనగా దుర్గ గుడి ఉద్యోగులు టోల్ గేట్ వద్ద నిరసన చేపట్టారు.