: మహేశ్ బాబు కటౌట్ తొలగింపుపై ఉద్రిక్తత... కటౌట్ పైనుంచి కాల్వలోకి దూకిన అభిమాని


'ఆగడు' సినిమా మరికొన్ని రోజుల్లో విడుదల కానున్న నేపథ్యంలో, మహేశ్ బాబు కటౌట్ ఏర్పాటు చేసిన అభిమానులకు అధికారుల తీరు ఆగ్రహం తెప్పించింది. విజయవాడ అలంకార్ సెంటర్లో 90 అడుగుల కటౌట్ ను ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు. దీనిపై అధికారులు అభ్యంతరం తెలిపారు. అనుమతి లేదంటూ తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో, అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అధికారులకు, మహేశ్ బాబు అభిమానులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఓ అభిమాని కటౌట్ పైనుంచి కాల్వలోకి దూకాడు. ఇది గమనించిన స్థానికులు అతడిని కాపాడారు.

  • Loading...

More Telugu News