: తెలంగాణ సమాజం ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే ఊరుకోం: కేటీఆర్
తెలంగాణ సమాజం ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించే వారెవరినీ తాము క్షమించబోమని తెలంగాణ రాష్ట్ర పంచాయతీ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా టీవీ9, ఏబీఎన్ చానళ్లు తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కార్యక్రమాలు ప్రసారం చేశాయని ఆయన ఆరోపించారు. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టీవీ 9, ఏబీఎన్ ప్రసారాలపై నిషేధాన్ని ఆయన సమర్థించుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, భారత ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా 'టీ' చానల్ లో కార్యక్రమాలు ప్రసారాలు చేస్తే కేంద్రం చూస్తూ ఊరుకుంటుందా? అని ఆయన ప్రశ్నించారు.