: ఈ స్కూల్లో విద్యార్థులకు మద్యం సరఫరా చేస్తారు!
జార్ఖండ్ లోని ఓ పాఠశాలలో విద్యార్థులకు మద్యం సరఫరా చేస్తుండడం కలకలం రేపింది. గఢ్వా జిల్లాలోని కుద్రుం జన జాతీయ ఆవాసీయ విద్యాలయలో విద్యార్థులకు మద్యం అందుబాటులో ఉంచడమే కాకుండా, వారికి నీలి చిత్రాలు కూడా చూపిస్తున్నారట. పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (పీయూసీఎల్)కు చెందిన ఐదుగురు సభ్యుల బృందం ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేసింది. దీనిపై, ప్రిన్సిపాల్ గణేశ్ సింగ్ ముండా ఏమంటున్నారో చూడండి. కుద్రుం గ్రామంలో టీచర్, స్టూడెంట్ అన్న తేడా లేకుండా, అందరూ తాగుతారని సెలవిచ్చారు. పీయూసీఎల్ ప్రతినిధులు జిల్లా సంక్షేమ అధికారిని కలవగా, పూర్తిస్థాయి సూపరింటిండెంట్ లేకపోవడంతో ఆ పాఠశాల బాధ్యతలను తాము గనౌరి మహతో అనే ఉద్యోగికి అప్పగించామని, విద్యార్థుల ప్రవర్తనకు అతనిదే బాధ్యత అని తెలిపారు. మహతో మాట్లాడుతూ, విద్యార్థుల మద్యపానానికి తనకు సంబంధం లేదని, ఈ ఉదంతంలో తాను బలిపశువునయ్యానని వాపోయారు. దీనిపై స్పందించిన ప్రిన్సిపాల్ గణేస్ సింగ్... మహతోను అనవసరంగా ఈ వ్యవహారంలోకి లాగారని, అతన్ని తప్పుబట్టడం సరికాదని అన్నారు. ఇక్కడి గ్రామంలో పుట్టినప్పటినుంచే మందు పోస్తారని ఆయన చెప్పుకొచ్చారు.